కోవిడ్ ఎవ్వరినీ వదలిపెట్టదు.. అన్ని దేశాలకూ కొత్త స్ట్రెయిన్ ముప్పు.. వైరస్ ఇప్పుడే పోదు

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను కబళిస్తోంది. ఈ స్థాయిలో ప్రపంచంలో మరెక్కడా కోవిడ్ కేసులు లేవు. అమెరికా, చైనా, యూకే సహా అంతటా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి తరుణంలో మోడెర్నా ఔషధ కంపెనీ సీఈవో సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఇప్పుడే పోదు.. ముందుంది అసలు ముప్పు అని బాంబు పేల్చారు.