నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పీడ్ పెంచారు. శస్త్ర చికిత్స తరువాత కొన్ని రోజుల విరామానికి పరిమితమైన ఆమె.. తరువాత వర్క్ ఫ్రాంతో తన పని ప్రారంభించారు. ఇటు పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. త్వరలో మంత్రి పదవి ఖాయమనే ప్రచారం ఉండడంతో అన్ లైన్ లోనూ ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. మరోవైపు మంత్రి పదవి ఖరారైనంత వరకు ఖాళీ ఉండకుండా స్మాల్ స్క్రీన్ రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు.
నిన్నటి వరకు వర్క్ ఫ్రాం హోమ్ ఫోటోలు.. ఫ్యామిలీతో స్పెండ్ చేసిన ఫోటోలు,, వేడుకలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ వచ్చిన రోజా.. తాజాగా ఫ్యాన్స్ కు పిక్కించేలా చిలిపి చూపులతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. అభిమానుల చూపు తిప్పుకోకూడదు అనేలా ఫోజులు ఇస్తున్న ఫోటోనూ ఆమె షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముఖ్యంగా జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోలకు దూరమయ్యాను అనే ఫీలింగ్ ఆమెలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆ నవ్వులను మరిచిపోలేకపోతున్నా అంటున్నారు రోజా.. ఇప్పటికే ఆమె జబర్ధస్త్ తో పాటు మరో స్మాల్ స్క్రీన్ షోకు కూడా రెడీ అయినట్టు సమాచారం. త్వరలోనే రోజా రీ ఎంట్రీని చూసే అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి షూటింగ్ లో సైతం ఆమె పాల్గొన్నట్టు తెలుస్తోంది.