వివాహం చేసుకోడానికి అనుమతి ఇస్తూనే కొన్ని షరతులు పెట్టింది. పెళ్లి వేడుకకు 50 మంది మించకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే స్థానిక పోలీసులకు ముందస్తుగానే సమాచారం ఇవ్వాలని పేర్కొంది. భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలని.. పరిశారాలు శానిటైజ్ చేయడంతో పాటు వివాహానికి హాజరయ్యే వారంతా తప్పక మాస్క్ ధరించాలనే నిబందన పెట్టింది.
పెళ్లి శుభలేఖ, హాజరయ్యేవారి ఆదార్ నెంబర్లు అన్ని సవ్యంగా ఉంటేనే అనుమతి లభిస్తుంది. ముఖ్యంగా ఈ నెలలో భారీగా ముహూర్తాలు ఉన్నాయి. గత ఏడాది కరోనాతో వాయిదా వేసుకున్న వారితో పాటు సంక్రాంతి తరువాత వివాహ సంబంధాలు నిశ్చయించుకున్న వారు ఈ నెలలో శుభ ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లకు నిర్ణయించారు. ఈ నెల 5, 6, 12, 13, 14, 22, 27, 28, 29, 30 తేదీల్లో ముహూర్తాలు అధికంగా ఉన్నాయి.
ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వివాహాలకు సంబంధించి అనుమతి కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 50 మందికి మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. దరఖాస్తుతో పాటు వధువు, వరుడు ఆధార్ కార్డులు, వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులతో పాటు శుభలేఖ లేదా లఘ్న పత్రిక నఖలను సమర్పిస్తే వాటిని పరిశీలించి అనుమతి ఇస్తున్నారు.