Lockdown: ఆ దేశ రాజధానిలో మళ్లీ లాక్డౌన్ .. వింత అనారోగ్య సమస్యలతో వణికిపోతున్న ప్రజలు
Lockdown: ఆ దేశ రాజధానిలో మళ్లీ లాక్డౌన్ .. వింత అనారోగ్య సమస్యలతో వణికిపోతున్న ప్రజలు
Lockdown: చైనాకు పొరుగున్న ఉన్న ఉత్తర కొరియా రాజధానిలో ఐదు రోజుల పాటు లాక్డౌన్ విధించారు. అయితే ఇక్కడ లాక్డౌన్ విధించడానికి కారణాలు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.
ప్రపంచ దేశాల్లో ఏదో ఓ చోట కరోనా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ముఖ్యంగా చైనా, ఉత్తర కొరియాను కొత్త అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా తరహా లక్షణలతో పాజిటివ్ కేసులు, మరణాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.(ప్రతీకాత్మకచిత్రం)
2/ 9
పాజిటివ్ కేసులతో పాటు వైరస్ చైనా ప్రజల్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. రోజుల వ్యవధిలో మరణాల సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. మొదట కరోనా వైరస్‌కు పురుడు పోసిన దేశంలో మళ్లీ మరణమృదంగం ప్రారంభమైంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 9
చైనాకు పొరుగున్న ఉన్న ఉత్తర కొరియా రాజధానిలో ఐదు రోజుల పాటు లాక్డౌన్ విధించారు. అయితే ఇక్కడ లాక్డౌన్ విధించడానికి కరోనా కారణమని కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నారు ప్రభుత్వ అధికారులు..(ప్రతీకాత్మకచిత్రం)
4/ 9
చైనాలో ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తడంపై అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు ఇచ్చిన వ్యాక్సిన్లపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ విజృంభణకు లాక్డౌన్ ఎత్తివేయడమే కారణంగా భావిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 9
ఉత్తర కొరియాలో రాజధాని నగరంలో శ్వాసకోశ అనారోగ్యానికి సంబంధించిన కేసులు పెరగడం వల్లే లాక్‌డౌన్‌కు కారణమని పేర్కొంది. బుధవారం ప్రారంభమైన లాక్డౌన్ ఆదివారం వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. .(ప్రతీకాత్మకచిత్రం)
6/ 9
అయితే దేశ ప్రజలు ఎప్పటికప్పుడు తమ టెంపరేచర్‌తో పాటు రిపోర్టులను ప్రభుత్వ అధికారులకు సమర్పించాలని సూచించింది. అయితే రాజధాని ఉత్తర కొరియా రాజధాని నగరంలోనేనా లేక ఇతర పట్టణాల్లో కూడా అమలవుతోందా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. .(ప్రతీకాత్మకచిత్రం)
7/ 9
ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో స్థానికులు నిత్యవసరాలు, ఆహార పదార్ధాలను పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నారు. గతేడాది ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు నమోదువడం కారణంగానే ఈసారి ముందుగానే అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. .(ప్రతీకాత్మకచిత్రం)
8/ 9
గతేడాది కరోనా కేసుల్ని ఆగస్ట్ నెలలోగా కంట్రోల్ చేశామని ఉత్తర కొరియా అధికారులు వెల్లడించారు. ఈసారి శ్వాసకోశ సంబంధింత కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వైద్య సహాయం అందించలేని స్థితిలో ఉన్నందునే లాక్డౌన్ విధించినట్లుగా పేర్కొంటున్నారు.
9/ 9
అయితే రోజు రోజుకు శ్వాసకోశ సంబంధింత సమస్యలు ఎక్కువ మందిలో బయటపడుతూ ఉండటంతో ఎంత మంది ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు..? దీనికి కారణం ఏమై ఉండవచ్చనే దానిపై స్పష్టత లేదంటున్నారు ఉత్తర కొరియా అధికారులు. .(ప్రతీకాత్మకచిత్రం)