LOCKDOWN EXTENDED FOR SEPTEMBER 20 IN WEST BENGAL SAYS CM MAMATA BANERJEE AK
Lockdown: ఆ రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు.. వాటికి నో పర్మిషన్
Lockdown News: ఇప్పటికే నెల రోజుల నుంచి వారానికి రెండు రోజులపాటు బెంగాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలయ్యేలా నిర్ణయం తీసుకున్న సీఎం మమతా బెనర్జీ.. తాజాగా లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 17 వరకు కొనసాగించాలని నిర్ణయించారు.
ఓ వైపు లాక్డౌన్ కారణంగా మూతపడ్డ మరిన్ని వ్యవస్థలను తెరిచేందుకు కేంద్రం అన్‌లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఇప్పటికే నెల రోజుల నుంచి వారానికి రెండు రోజులపాటు బెంగాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలయ్యేలా నిర్ణయం తీసుకున్న సీఎం మమతా బెనర్జీ.. తాజాగా లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 17 వరకు కొనసాగించాలని నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
సెప్టెంబర్ 7,11,12 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. స్కూళ్లు, కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలు సెప్టెంబర్ 20 వరకు మూసే ఉంటాయని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి విమాన రాకపోకలకు అనుమతి ఇవ్వాలని ఆయా రాష్ట్రాలు కోరినట్టు తెలిపిన మమతా బెనర్జీ.. వారంలో మూడు రోజులు విమానాల రాకపోకలను అనుమతించాలని యోచిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనమతిస్తామని మమత స్పష్టం చేశారు. మిగతా అన్ని సంస్థలు వారంలో రెండు రోజులు మూసివేయాల్సిందే అని ప్రభుత్వం పేర్కొంది.(ఫైల్ ఫోటో)
6/ 6
ఇక నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు తెలిపిన మమతా బెనర్జీ.. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని విపక్షాల సమావేశంలో కోరారు.(ప్రతీకాత్మక చిత్రం)