యూకేలో విజృంభించిన ఈ ఒమిక్రాన్ భారత్‌లో కూడా ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,700కు చేరింది. దేశంలోని 23 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 510 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. తరువాత స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది.
ఢిల్లీలో 351 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం ఒమిక్రాన్ కారణంగా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. నైట్ కర్ఫ్యూ విధించడమే కాకుండా స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, సినిమా థియేటర్లు మూసివేశారు. మెట్రో రైళ్లు, బస్సులను 50 శాతం సామర్థ్యంతో నడపాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
ఇక.. ఢిల్లీతో పాటు 156, గుజరాత్ 136, 121, రాజస్తాన్ 120, 67, 64, హర్యానా 63, ఒడిస్సా 37, వెస్ట్ బెంగాల్ 20, ఆంధ్రప్రదేశ్ 17, మధ్యప్రదేశ్ 9, 8, ఉత్తరాఖండ్ 8, ఛండీగర్ 3, జమ్మూ మరియు కశ్మీర్ 3, అండమాన్నికోబార్ ఐలాండ్స్ 2, గోవా 1, హిమాచల్ ప్రదేశ్ 1, లద్ధాఖ్, మణిపూర్, పంజాబ్‌లో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ వేరియంట్ ఇంతకు ముందు వ్యాప్తి చెందిన వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలు కూడా అవసరమైతే నైట్ కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు విధించాలని కేంద్రం కీలక సూచన చేసింది. దీంతో.. ఢిల్లీ, బెంగాల్ బాటలో మరిన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూతో పాటు అవసరమైతే లాక్డౌన్ విధించే ఆలోచన కూడా చేస్తుండటం గమనార్హం.