Covid-19: కేరళలో భయంకరంగా కోవిడ్ వ్యాప్తి.. వరుసగా రెండో రోజు 30వేలకు పైగా కేసులు

Kerala corona updates: కేరళలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. వైరస్ వ్యాప్తి భయంకరంగా పెరిగిపోతోంది. మొన్నటి వరకు 20వేల కంటే తక్కువగా ఉన్న రోజువారీ కేసులు.. ఓనం పండగ తర్వాత భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా 30వేల కంటే ఎక్కువ కేసులు వస్తున్నాయి.