డెల్టా వేరియంట్ కంటే కరోనా మూడు రెట్లు వేగంగా వ్యాపిస్తుందని కేంద్రం తెలిపింది. దీని కారణంగా అవసరమైన చర్యలను తీసుకుంటోంది. ఇక కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో తమ గణిత నమూనా ద్వారా వ్యాప్తి రేటును ఖచ్చితంగా అంచనా వేసిన IIT కాన్పూర్ శాస్త్రవేత్త డాక్టర్ మనీంద్ర అగర్వాల్.. దేశంలో మూడో వేవ్ కూడా ఉంటుందని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం )
జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఇది ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. డెల్టా కంటే తక్కువ తీవ్రతకు సంబంధించిన సంకేతాలు కనుగొనబడలేదు. ఒమిక్రాన్‌కు సంబంధించి భయాందోళనకు గురిచేసే సూచనలు లేకపోయినప్పటికీ.. దీని ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతున్న విధానాన్ని బట్టి చూస్తే ఇది కొంచెం తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని ఆయన తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం )
ఒమిక్రాన్ విస్తరిస్తున్న తీరును పరిశీలిస్తే, ఫిబ్రవరిలో రోజువారీ కొత్త కేసులు 1.5 నుండి 1.7 లక్షల వరకు ఉండవచ్చని IIT కాన్పూర్ శాస్త్రవేత్త డాక్టర్ మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు. అయితే దేశంలో వ్యాక్సినేషన్ ను అమలు చేస్తున్న విధానాన్ని బట్టి ఈ గణాంకాలు కూడా తక్కువగా ఉండవచ్చని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం )