Coronavirus: సీఎం ఇంట్లో కరోనా కల్లోలం.. భార్యాపిల్లలు సహా మొత్తం 15 మందికి పాజిటివ్
Coronavirus: సీఎం ఇంట్లో కరోనా కల్లోలం.. భార్యాపిల్లలు సహా మొత్తం 15 మందికి పాజిటివ్
Coronavirus: మనదేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి భయంకరంగా ఉంది. ప్రతి రోజు లక్షన్నరకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. సాధారణ ప్రజలే కాదు.. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా ఝార్ఖండ్ సీఎం ఇంట్లో కరోనా కల్లోలం నెలకొంది.
1/ 5
మనదేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి భయంకరంగా ఉంది. ప్రతి రోజు లక్షన్నరకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. సాధారణ ప్రజలే కాదు.. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా ఝార్ఖండ్ సీఎం ఇంట్లో కరోనా కల్లోలం నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
సీఎం హేమంత్ సోరెన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చింది. ఐనప్పటికీ తన నివాసంలో అంత మందికి పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు
3/ 5
ముఖ్యమంత్రి నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కోవిడ్ -19 పరీక్షలు చేసినట్లు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. వారిలో 15 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఇవాళ్టి కరోనా బులెటిన్ ప్రకారం.. ఝార్ఖండ్‌లో 5,081 కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్న 1,186 మంది కోలుకోగా.. మరో ముగ్గురు మరణించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో 21,098 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
మరోవైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 27 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. ఐతే ఝార్ఖండ్‌లో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని గణాంకాలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)