ప్రపంచ వ్యాప్తంగా తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ కారణంగానే ప్రతీ ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించడం అలవాటు చేసుకున్నారు. కొందరు వ్యక్తులు అయితే సరికొత్త ప్రయోగాలకు తెరలేపుతున్నారు. రక్షణ కోసం ధరించే ఫేస్‌మాస్క్‌ను చిత్ర విచిత్ర రూపాల్లో తయారు చేసి.. జనాలను షాక్ ఇస్తున్నారు..
కొబ్బరి చిప్పకు రెండు చివరలా చెవులకు తాకించేలా రబ్బరు దారాలను ఏర్పాటు చేశాడు. అలాగే కొబ్బరి చిప్పకు చిన్న రంద్రం చేసి, దానికి విజిల్‌ను ఫిక్స్ చేశాడు. విజిల్ వేసేందుకు మళ్లీ మళ్లీ ముసుగు తీయాల్సిన పనిలేదంటున్నాడు నంగా. అయితే, ఈ మాస్క్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. కొబ్బరిచిప్ప మాస్క్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు.
ఇదిలాఉంటే.. నంగా రూపొందించిన ప్రత్యేక మాస్క్ అతనికి సమస్యలు కొనితెచ్చిపెట్టింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు.. కరోనా మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలంటూ చురకలంటించారు. ఆ మాస్క్ తీసేసి.. ప్రామాణికమైన మాస్క్ ధరించాలని సూచించారు. అయితే, విజిల్ వేయడంలో ఇబ్బందిగా ఉందని, ఆ కారణంగానే కొబ్బరి చిప్పను ఉపయోగించి మాస్క్ తయారు చేసుకున్నానని పోలీసులకు నంగా వివరణ ఇచ్చుకున్నాడు.