INDIAS NEW WORLD RECORD OVER 2 5 CRORE PEOPLE VACCINATED ON PM NARENDRA MODI BIRTHDAY SK
Corona Vaccination: ఒకే రోజు 2.49 కోట్ల మందికి టీకాలు.. మోదీ పుట్టిన రోజున భారత్ ప్రపంచ రికార్డు
Corona vaccination: మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 79 కోట్ల డోసుల టీకాలు వేశారు. ఐతే వ్యాక్సినేషన్లో భారత్ కొత్త కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. తాజాగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా వ్యాక్సినేషన్లో ప్రపంచ రికార్డు సృష్టించింది ఇండియా.
సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క రోజే ఏకంగా 2.49 కోట్ల మందికి టీకాలు వేశారు. ఏ దేశంలోనూ ఒకే రోజు ఈ స్థాయిలో టీకాలు వేయలేదు. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు వేసిన టీకా డోసు సంఖ్య 79 కోట్లు దాటింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
శుక్రవారం అత్యధికంగా కర్నాటకలో కరోనా టీకాలు వేశారు. కర్నాటకలో నిన్న 26.9 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్ (26.6 లక్షలు), ఉత్తరప్రదేశ్ (24.8 లక్షలు), మధ్యప్రదేశ్ (23.7 లక్షలు), గుజరాత్ (20.4 లక్షలు) ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
శుక్రవారం ప్రతి గంటకు 17 లక్షల మందికి, ప్రతి నిమిషానికి 18వేల మందికి, ప్రతి సెకండ్కు 466 మందికి కరోనా టీకాలు వేశారు. ఐతే మోదీ పుట్టిన రోజున మాత్రమే కాదు... ప్రతి రోజూ ఇదే స్థాయిలో టీకాలు వేస్తే కరోనా నుంచి మన దేశం బయటపడుతుందని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
కోవిన్ పోర్టల్లో ఉన్న వివరాల ప్రకారం.. మన దేశంలో ఇప్పటి వరకు మొత్తం 79.35 డోసుల వ్యాక్సిన్ వేశారు. ఇందులో 59.59 కోట్ల మంది ఒక డోస్ వేసుకోగా.. 19.76 కోట్ల మంది రెండు డోసులు వేసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
నిన్న రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాల్గొన్న డాక్టర్లు, ఇన్నోవేటర్స్, అడ్మినిస్ట్రేటర్స్, నర్సులు, హెల్త్ కేర్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. (ప్రతీకాత్మక చిత్రం)