వ్యాక్సిన్ మైత్రి ఇన్షియేటివ్(Vaccine Maitri initiative)లో భాగంగా జనవరి 21 నుంచి విదేశాలకు భారత్ వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొరుగు దేశాలు, భారత భాగస్వామి దేశాలకు భారత ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ చేపట్టింది. వీటిలో కొంత వరకు గ్రాంట్ల రూపంలో ఇవ్వగా, మరికొంత భాగాన్ని కమర్షియల్ ప్రతిపాదికను అందిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
గ్రాంట్ల రూపంలో వ్యాక్సిన్ పంపబడుతున్న దేశాల్లో.. భారత పొరుగు దేశాలతో పాటు, పశ్చిమ ఆసియా దేశాలు ఉన్నాయి. వాటిలో.. బంగ్లాదేశ్(2 మిలియన్ల డోస్‌లు), నేపాల్(1 మిలియన్ డోస్‌లు), భూటాన్ (1,50,000 డోస్‌లు), మాల్దీవులు(1,00,000 డోస్‌లు), మారిషస్(1,00,000 డోస్‌లు), సీషెల్స్(50,000 డోస్‌లు), శ్రీలంక (5,00,000 డోస్‌లు), బహ్రెయిన్(1,00,000 డోస్‌లు), ఆఫ్ఘనిస్తాన్(5,00,000 డోస్‌లు), ఒమన్(1,00,000 డోస్‌లు), బార్బడోస్(1,00,000 డోస్‌లు), డొమినికా(70,000 డోస్‌లు) ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
మరోవైపు కమర్షియల్ ప్రతిపాదన వ్యాక్సిన్‌ను.. బ్రెజిల్(2 మిలియన్ల డోస్‌లు), మొరాకో(6 మిలియన్ల డోస్‌లు), బంగ్లాదేశ్(5 మిలియన్ డోస్‌లు), మయన్మార్(2 మిలియన్ల డోస్‌లు), ఈజిప్టు(50 వేల డోస్‌లు), అల్జీరియా(50వేల డోస్‌లు), దక్షిణాఫ్రికా(1 మిలియన్ డోస్‌లు), కువైట్(2 లక్షల డోస్‌లు), యూఏఈ(2 లక్షల డోస్‌లు) భారత ప్రభుత్వం అందజేస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)