India Corona Updates: భారత్‌లో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. తాజా బులెటిన్ వివరాలు
India Corona Updates: భారత్‌లో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. తాజా బులెటిన్ వివరాలు
India Corona updates: ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త కేసులు 10వేల లోపే నమోదవుతున్నా.. రికవరీల కంటే ఎక్కువగా వస్తుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. మరి నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మంది మరణిచారు? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
India Corona cases: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 8,503 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి కొత్తగా 7,678మంది కోలుకున్నారు. 624మరణాలు నమోదయ్యాయి. మన దేశంలో మళ్లీ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవడమే దీనికి కారణం. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,74,744కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,41,05,066మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,74,735 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 94,943 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
భారత్‌లో 14 రోజులుగా కొత్త కేసులు 10వేల లోపే నమోదవుతున్నాయి. కొత్త కేేసులు తక్కువగానే ఉన్నప్పటికీ.. రెండు రోజులుగా యాక్టివ్ కేసులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 0.73శాతంగా నమోదయింది. నిన్నటి బులెటిన్‌లో 0.66 శాతంగా ఉంది. గత 11 రోజులుగా టెస్ట్ పాజిటివిటీ రేటు 1 లోపే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో నిన్న 12,93,412 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 65.32 లక్షల మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 74,57,970 మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 131.18 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)