India Corona Updates: భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త వేరియెంట్ వణికిస్తున్న వేళ నిజంగా ఊరటే
India Corona Updates: భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త వేరియెంట్ వణికిస్తున్న వేళ నిజంగా ఊరటే
India Corona Updates: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కరోనా వేరియెంట్ ఆందోళన కలిగిస్తున్న వేళ.. భారత్‌లో కరోనా కేసులు తగ్గముఖం పట్టడం ఊరటనిచ్చే విషయం. ఇవాళ్టి బులెటిన్‌లో కొత్త కేసులు భారీగా తగ్గాయి. మరి తాజా బులెటిన్‌లో ముఖ్యమైన అంశాలను ఇక్కడ చూద్దాం.
India Corona cases: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 8,318 కరోనా కేసులు నమోదయ్యాయి. 10,967 మంది కోవిడ్ మహమ్మారి నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 465 మరణాలు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,63,749 కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,39,88,797 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,67,933 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 1,07,019 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
నిన్నటి బులెటిన్‌లో 10వేలకు పైగా కేసులు నమోదవగా.. ఇవాళ్టి బులెటిన్‌లో మాత్రం 9వేల లోపే నమోదయ్యాయి. ఇది శుభపరిణామం. ఐతే 17 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
నిన్న కేరళలో 4,677 కేసులు నమోదయ్యాయి. 388 మంది మరణించారు. ఇందులో ఎక్కువగా బ్యాక్లాగ్ మరణాలున్నాయి. తమిళనాడులో 746 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
నిన్నటితో పోల్చితే ఇవాళ టెస్ట్ పాజిటివిటీ రేటు స్వల్పంగా పెరిగింది. నిన్నటి బులెటిన్‌లో 0.79 శాతంగా ఉండగా..ఇవాళ 0.89 శాతంగా ఉంది. మిజోరాం (10.29 %), కేరళ (8.99%), మణిపూర్‌లో (3.05)లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది.
6/ 7
భారత్‌లో నిన్న 9,69,354 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 63.82 లక్షల మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 73,58,017 మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 121.06 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)