కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలోనూ భయాలు రేకెత్తిస్తున్నది. దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో సౌతాఫ్రికా నుంచి వచ్చిన పలువురు కరోనా పాజిటివ్ గా తేలడం, వారికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా, కాదా అని తదుపరి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి క్వారంటైన్ లో ఉండేలా చర్యలు చేపట్టారు.