India Corona cases: భారత్‌లో కరోనా మూడోదశ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఉప్పెనలా విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో 67,084 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 1,67,882 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,241 మరణాలు నమోదయ్యాయి. నిన్నటి కంటే 6శాతం తక్కువ కేసులు వచ్చాయి. వరుసగా నాలుగో రోజు లక్ష లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం కేరళ నుంచే అత్యధిక కేసులు వస్తున్నాయి. కేరళలో నిన్న 23,253 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్న 854 మరణాలు నమోదయ్యాయి. ఐతే మరణాల సంఖ్యను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో 627 బ్యాక్‌లాక్ మరణాలే ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో 2,58,954 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కేరళ తప్ప ఏ రాష్ట్రంలో కూడా 10వేల కంటే ఎక్కువ కేసులు రావడం లేదు. మహారాష్ట్రలో 7,142, కర్నాటకలో 5,339, రాజస్థాన్‌లో 3,971 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1,679, తెలంగాణలో 865 కరోనా కేసులు వచ్చాయి. కొత్త కేసులు భారీగా తగ్గడం ఊరటనిచ్చే విషయం. పాజిటివిటీ రేటు తగ్గడంతో థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్లేనని నిపుణులు అభిప్రాయడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)