India Corona Bulletin: అక్కడ థర్డ్ వేవ్ మొదలైందా? భారీగా పెరిగిన కరోనా కేసులు.. తాజా బులెటిన్ ఇదే
India Corona Bulletin: అక్కడ థర్డ్ వేవ్ మొదలైందా? భారీగా పెరిగిన కరోనా కేసులు.. తాజా బులెటిన్ ఇదే
India Corona Bulletin: యూరప్‌లో ఒమిక్రాన్ అల్లకల్లోలం సృష్టిస్తున్నా.. మన దేశంలో మాత్రం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కానీ మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అక్కడ థర్డ్ వేవ్ మొదలయిందా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
1/ 8
India Corona cases: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 6,650 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి కొత్తగా 7,051 మంది కోలుకున్నారు. 374 మరణాలు నమోదయ్యాయి. నిన్నటి బులెటిన్ కంటే ఇవాళ్టి బులెటిన్‌లో తక్కువ కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,47,72,626కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు 3,42,15,977 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,79,133 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 77,516 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
18 రోజుల్లో కరోనా యాక్టివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 0.62 శాతంగా నమోదయింది. నిన్నటి బులెటిన్‌లో 0.51 శాతంగా ఉంది. గత 24 రోజులుగా టెస్ట్ పాజిటివిటీ రేటు 1 లోపే ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
మన దేశంలో కేరళలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. నిన్న కేరళలో 2,514 కేసులు నమోదయ్యాయి. 323 మరణాలు నమోదయ్యాయి. ఇందులో బ్యాక్లాగ్ మరణాలే ఎక్కువగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
మహరాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు వెయ్యికి పైగా కొత్త కేసులు వచ్చాయి. నిన్న మహరాష్ట్రలో 1,179 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఒమిక్రాన్‌తో పాటు కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
భారత్‌లో నిన్న 11.65 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. నిన్న దేశవ్యాప్తంగా 57.44 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 140.31 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
కరోనా అదుపులోనే ఉన్నా..మరో వైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 358 కేసులు నమోదవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)