India Corona cases: భారత్‌లో కరోనా తగ్గముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా 50,407 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి బులెటిన్‌తో పోల్చితే కొత్త కేసులు 13 శాతం మేర తగ్గాయి. నిన్న 1,36,962 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మన దేశంలో నిన్న 807 మరణాలు నమోదయ్యాయి. వరసగా ఆరు రోజు లక్ష లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,25,86,544కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు 4,14,68,120 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 5,07,981 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 6,10,443 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కరోనా బాధితుల్లో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.34శాతం మాత్రమే ఉన్నాయి.. (ప్రతీకాత్మక చిత్రం)
కేరళ తప్ప ఏ రాష్ట్రంలోనే 7వేల కంటే ఎక్కువ రోజువారీ కేసులు నమోదవడం లేదు. కేరళ తర్వాత మహారాష్ట్ర రెండో స్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో 5455, కర్నాటకలో 3976, తమిళనాడులో 3086, రాజస్థాన్‌లో 2890 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1166, తెలంగాణలో 733 కరోనా కేసులు వచ్చాయి. కొత్త కేసులు భారీగా తగ్గడంతో మన దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్లేనని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)