India Corona cases: డేంజర్ బెల్స్.. భారత్లో అనూహ్యంగా పెరిగిన కోవిడ్ కేసులు..
India Corona cases: డేంజర్ బెల్స్.. భారత్లో అనూహ్యంగా పెరిగిన కోవిడ్ కేసులు..
India Corona Updates: భారత్లో కరోనా వ్యాప్తి మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఐతే ఒక్క రాష్ట్రంలోనే కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. అందుకే ఇండియా కరోనా బులెటిన్లో కొత్త కేసులు అనూహ్యంగా పెరిగాయి. మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
భారత్లో గడిచిన 24 గంటల్లో 46,164 కరోనా కేసులు నమోదయ్యాయి. 34,159 మంది కోలుకున్నారు. మరో 607 మంది మరణించారు. థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలోనే..కొత్త కేసులు మళ్లీ 40వేలకు పైగా నమోదవడం...ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
తాజా కేసులతో ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 3,25,58,530కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,17,88,440 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,36,365 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 3,33,725 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఐతే మనదేశంలో కేవలం కేరళలోనే భారీగా కేసులు వస్తున్నాయి. నిన్న ఒక్క రోజే 31,445 మందికి కరోనా నిర్ధాణ అయింది. దేశవ్యాప్తంగా నమోదయిన కేసుల్లో ఏకంగా 68 శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఓనం పండగ తర్వాత భారీగా కేసులు వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో సగానికి పైగా కేరళలోనే ఉన్నాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ కేసులు (5,031) నమోదవుతున్నాయి. రెండు రోజులుగా మరణాల సంఖ్య కూడా పెరిగింది. ప్రతి రోజు 600కు పైగా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
నిన్న దేశవ్యాప్తంగా 17,87,283 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 51.31 కోట్ల టెస్ట్లు నిర్వహించారు. నిన్న మన దేశంలో 80,40,407 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 60.38 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)