న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోల్చుకుంటే నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో భారత్‌లో 45,352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మరణాలు కూడా కొంత తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయం.