తాజా కేసులతో కలిపి .. భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,26,31,421కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు 4,15,85,711 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 5,08,665 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 5,37,045 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కరోనా బాధితుల్లో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.43 శాతం మాత్రమే ఉన్నాయి.. (ప్రతీకాత్మక చిత్రం)
కరోనా కొత్త కేసుల్లో కేరళ ప్రథమ స్థానంలో కొసాగుతోంది. శనివారం కేరళలో 15,184 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్న 427 మరణాలు నమోదయ్యాయి. ఇందులో బ్యాక్‌లాక్ మరణాలే అత్యధికంగా ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో కూాడా యాక్టివ్ కేసులు తగ్గాయి. ప్రస్తుతం అక్కడ 1,82,118 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)