భారత్‌లో గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 39,114 మంది కోలుకున్నారు. 2020లో భారత్‌లో కోవిడ్ కేసులను ఒక్కసారి పరిశీలిస్తే.. ఆగస్ట్ 7కు 20 లక్షల మార్క్‌ను చేరుకున్నాయి. ఆగస్ట్ 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలు, సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షల మార్క్‌ను కోవిడ్-19 కేసులు భారత్‌లో చేరుకోవడం గమనార్హం.
భారత్‌లో వ్యాక్సినేషన్ కూడా శరవేగంగా ముందుకు సాగుతోంది. బుధవారం నాటికి భారత్‌లో మొత్తం 70.75 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3.91 లక్షలు. పాజిటివిటీ రేటు 2.49 శాతంగా ఉంది. ఇక.. భారత్‌లో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో కేరళలోనే ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం.