తాజా కేసులతో కలిపి భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,54,315కి చేరింది. భారత్లో ఇప్పటి వరకు 4,19,10,984 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 5,10,413 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 3,32,918 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దాద్రానగర్ హవేలీ డామన్ డయూ తప్ప అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)