INDIA REPORTS 306064 NEW COVID CASES AND 439 DEATHS IN LAST 24 HRS ACTIVE CASES CLIMB TO 2249335 MKS
India Covid Update: కరోనా విలయం: 21శాతానికి పాజిటివిటీ రేటు -కొత్తగా 3.06లక్షల కేసులు, 439 మరణాలు
భారత్లో కరోనా వైరస్ మూడో వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు కొద్దిగా తగ్గినా, పాజిటివిటీ రేటు రికార్డు స్థాయికి పెరిగింది. మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ వివరాలివి..
దేశంలో కరోనా వ్యాప్తి వెల్లువలా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14 లక్షల టెస్టులు చేపట్టగా, కొత్తగా 3,06,064 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4కోట్లకు చేరువగా, 3.95కోట్లకు చేరింది.
2/ 7
తెలంగాణ కరోనా కేసులు, తెలంగాణ తాజా కరోనా కేసులు, కరోనా కేసులు" width="1600" height="1600" /> కిందటి రోజుతో పోల్చుకుంటే కొత్త కేసులు 27వేలు తక్కువగా వచ్చినా, పాజిటివిటీ రేటు మాత్రం భారీగా పెరిగింది. పాజిటివిటీ రేటు 17 శాతం నుంచి 20.7 శాతానికి పెరిగింది.
3/ 7
కరోనా వల్ల చనిపోతున్నవారి సంఖ్య భారీగానే ఉంది. నిన్న ఒక్కరోజే కొవిడ్ కాటుకు 439 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతొ మొత్తం మరణాల సంఖ్య 4లక్షల 89వేల 848కి పెరిగింది.
4/ 7
ఒమిక్రాన్ కేసులు, భారత్ లో ఒమిక్రాన్" width="1600" height="1600" /> కొవిడ్ బారి నుంచి నిన్న ఒక్కరోజే 2లక్షల 43వేల 495 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3.68కోట్లకు చేరింది. దేశంలో రికవరీ రేటు 93.07 శాతంగా ఉంది.
5/ 7
కొత్త కేసులు భారీగా వస్తుండటం, ఆ స్థాయిలో రికవరీలు లేకపోవడంతో దేశంలో యాక్టివ్ కేసులు భారీగా పేరుకుపోయాయి. ప్రస్తుతం 22లక్షల 49వుల 335 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఈ సంఖ్య 5.69 శాతానికి సమానం.
6/ 7
కొత్త కేసులు కొన్ని రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఒక్క కర్ణాటకలోనే 50వేల కేసులు వచ్చాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులోనూ వైరస్ తీవ్రత అధికంగా ఉంది.
7/ 7
వారాంతపు సెలవు కావడంతో ఆదివారం 27 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్లు అందించారు. ఇప్పటి దాకా మొత్తంగా 162 కోట్లకుపైగా టీకా డోసులను పంపిణీ చేశారు.