Covid-19 updates: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. అదుపులోనే ఉందా? కొత్త కేసులు ఎన్నంటే..
Covid-19 updates: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. అదుపులోనే ఉందా? కొత్త కేసులు ఎన్నంటే..
Covid-19 Updates: భారత్‌లో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు, మరణాలు తక్కువగానే నమోదవుతున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు? ఈ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
India corona updates: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 23,529 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి 28,718 మంది కోలుకున్నారు. నిన్న 311 మంది మరణించారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండడం ఊరట కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
తాజా కేసులతో కలిపి భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,39,980కి చేరింది. వీరిలో 3,30,14,898 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,48,062 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,020 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ప్రస్తుతం మన దేశంలో కేరళలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. నిన్న 12, 161 మందికి కరోనా నిర్ధారణ అయింది. కేరళ తర్వాత మహారాష్ట్రలో 3,187 కొత్త కేసులు వచ్చాయి. ఐతే మిజోరాంలో 1741 మందికి కరోనా రావడం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
మన దేశంలో నిన్న 15,06,254 మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 56,89,56,439కి చేరింది. ఇక బుధవారం 65,34,306 మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు భారత్‌లో 88,34,70,578 డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)