India Corona Updates: ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా.. ఇవాళ్టి బులెటిన్‌లో షాకింగ్ వివరాలు
India Corona Updates: ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా.. ఇవాళ్టి బులెటిన్‌లో షాకింగ్ వివరాలు
India Corona Updates: ఒమిక్రాన్ వేరియెంట్‌తో మన దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. రోజువారీ కేసులు లక్షన్నరకు పైగా నమోదవుతున్నాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు ఏకంగా 10కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ్టి బులెటిన్ హైలైట్స్ ఇక్కడ చూద్దాం.
India Corona cases: భారత్‌లో కరోనా మూడో దశ వ్యాప్తి సునామీలో విరుచుకుపడుతోంది. బాధితుల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,59,632 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. శనివారం దేశవ్యాప్తంగా 40,863 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 327 మరణాలు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
శనివారం 15,63,566 మందికి కరోనా పరీక్షలు చేస్తే.. 1,59,632 మందికి పాజిటివ్ వచ్చింది. కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేటు 10 శాతంగా ఉంది. అంటే కరోనా టెస్ట్ చేయించుకున్న ప్రతి 10 మందిలో ఒకరికి పాజిటివ్ వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,55,28,004కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు 3,44,53,603 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,83,790 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 5,90,611 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
మన దేశంలో టెస్ట్ పాజిటివిటీ భారీగా పెరుగుతోంది. ఏకంగా 10 శాతానికి పెరిగింది. పశ్చిమ బెంగాల్లో 28.34 శాతానికి చేరింది. గోవాలో 20.36, మహారాష్ట్రలో 16 శాతం పాజిటివిటీ రేటు ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
మహారాష్ట్రపై పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అక్కడ కొత్తగా 41,434 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి. ఢిల్లీలో 20,181 కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్లో 18,802, కర్నాటకలో 8,906 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
భారత్‌లో నిన్న 15.63 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం కరోనా పరీక్ష సంఖ్య 69 కోట్లకు చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 89.28 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 151.57 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
కొత్త ఏడాదిలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాది క్రిస్మస్ సమయంలో డైలీ కేసులు 6వేలు ఉంటే.. ఇప్పుడు లక్షా 40వేలకు పైగా కేసులు వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ కూడా విజృంభిస్తోంది. 27 రాష్ట్రాలకు విస్తరించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,623 కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,409 మంది కోలుకున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, రాజస్థాన్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)