INDIA REPORTS 141986 FRESH COVID CASES 40895 RECOVERIES AND 285 DEATHS IN THE LAST 24 HOURS SK
India Corona Bulletin: భారత్‌పై ఉప్పెనలా విరుచుకుపడుతున్న కరోనా థర్డ్ వేవ్.. లక్షల్లో కొత్త కేసులు
India Corona Bulletin: భారత్‌లో కరోనావైరస్ భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. కోవిడ్ థర్డ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. కొత్త కేసులు లక్షల్లో వస్తున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఒమిక్రాన్ పరిస్థితేంటో ఇక్కడ తెలుసుకుందాం.
India Corona cases: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ భయంకరంగా ఉంది.కొత్త కేసులు లక్షల్లో వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,41,986 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 40,895 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 285 మరణాలు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
కొత్త కేసులు 222 రోజుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇక యాక్టివ్ కేసులు ఒకేసారి 1,00,806 పెరిగాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 187 రోజుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,52,68,372కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు 3,44,12,740 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,83,463 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 4,72,169 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
మన దేశంలో టెస్ట్ పాజిటివిటీ భారీగా పెరుగుతోంది. ఏకంగా 9.28 శాతానికి పెరిగింది. పశ్చిమ బెంగాల్లో 26.34 శాతానికి చేరింది. గోవాలో 17.36, మహారాష్ట్రలో 12.99శాతం పాజిటివిటీ రేటు ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
మహారాష్ట్రపై పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ఏకంగా 40,925 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో 18,213 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 17,335, కర్నాటకలో 8,449కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
భారత్‌లో నిన్న 15.29 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం కరోనా పరీక్ష సంఖ్య 68.84 కోట్లకు చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 90.59 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 150.61 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
క్రిస్మస్ తర్వాతి నుంచి మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. డిసెంబరు 26న రోజుకు 6 వేల కేసులు మాత్రమే వస్తే.. ఇప్పుడా సంఖ్య లక్షా 40వేలకు పైగా చేరింది. అంటే ఏకంగా 25 రెట్లు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
మరోవైపు ఒమిక్రాన్ విజృంభిస్తోంది. 27 రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,071 కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,203 మంది కోలుకున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, రాజస్థాన్‌లో అత్యధిక కేసులు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)