కొవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ (R Factor)ద్వారా అంచనా వేస్తారు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి సరాసరి ఎంత మందికి సోకుతుందో దీని ద్వారా తెలుస్తుంది. ఆర్ ఫ్యాక్టర్ 1గా ఉంటే ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి సోకుతున్నట్లు లెక్క. 2గా ఉంటే ఒకరి నుంచి ఇద్దరికి సోకుతున్నట్లు అర్థం చేసుకోవాలి.కానీ ఇప్పుడు ఒకరి నుంచి ఏకంగా నలుగురికి కోవిడ్ వ్యాధి సోకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
గత ఏడాది డెల్టా వేరియెంట్ అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. కేసులతో పాటు మరణాలు కూడా ఊహించని విధంగా నమోదయ్యాయి. ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రులు అల్లాడిపోయాయి. అప్పుడు ఆర్ నాట్ విలువ గరిష్టంగా 1.69 మాత్రమే ఉండేది. పీక్ స్టేజిలో ఉన్నప్పుడే అంత ఉంది. కానీ ఇప్పుడు మూడో దశ ప్రారంభంలోనే 4ని దాటింది. (ప్రతీకాత్మక చిత్రం)