Covid Update : దేశంలో తగ్గిన కొత్త కరోనా కేసులు,యాక్టివ్ కేసులు!
Covid Update : దేశంలో తగ్గిన కొత్త కరోనా కేసులు,యాక్టివ్ కేసులు!
రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే.
రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 4129 కరోనా వైరస్ కేసులు,20మరణాలు(Covid Deaths)నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,72,243కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,530కు చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య4,40,00,298కి చేరుకుంది.
4/ 7
దేశంలో ప్రస్తుతం 44,415 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్ గా ఉండగా, రికవరీ రేటు 98.72శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో ఆదివారం 11,67,772 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,17,68,35,714 కోట్లకు చేరింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు,మరణాలు భారీగా తగ్గాయి. కొత్తగా 2,49,111కోవిడ్ పాజిటివ్ కేసులు,460మరణాలు నమోదయ్యాయి. లో అత్యధికంగా 46,758కరోనా కేసులు,95 మరణాలు నమోదయ్యాయి. జపాన్ లో 40,918 కరోనా కేసులు,69మరణాలు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసులు 62,02,42,551 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,40,339మంది మరణించారు.కోలుకున్నవారి సంఖ్య 600,289,648కు చేరింది.(ప్రతీకాత్మక చిత్రం)