HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
INDIA LOCKDOWN INDIAN RAILWAYS TO CANCEL 39 LAKH TICKETS KNOW IRCTC REFUND RULES SS
Railways: మొత్తం 39 లక్షల రైలు టికెట్ల రద్దు... రీఫండ్ విధానం ఇదే
Indian Railways | భారతదేశంలో మే 3 వరకు లాక్డౌన్ కొనసాగుతుండటంతో భారతీయ రైల్వే అన్ని రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని టికెట్లు రద్దయ్యాయి. మరి రీఫండ్ ఎలా వస్తుందో తెలుసుకోండి.
News18 Telugu | April 15, 2020, 9:22 AM IST
1/ 10
1. భారతదేశంలో మే 3 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో రైల్, కొంకణ్ రైల్వే లాంటి సేవలన్నీ రద్దు చేస్తున్నామని భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
2. భారతీయ రైల్వే ఏప్రిల్ 15 నుంచి మే 3 మధ్య బుక్ అయిన 39 లక్షల టికెట్లను రద్దు చేస్తుందని అంచనా. అన్ని టికెట్లపై ఫుల్ రీఫండ్ వస్తుంది కాబట్టి ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైల్వేనే రైళ్లు రద్దు చేసింది కాబట్టి క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తించవు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
3. రైళ్లు రద్దు చేయడం మాత్రమే కాదు అడ్వాన్స్ బుకింగ్స్‌ని కూడా నిలిపివేసింది భారతీయ రైల్వే. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టికెట్ కౌంటర్స్, యూటీఎస్, పీఆర్ఎస్, ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఆపేస్తున్నట్టు రైల్వే ప్రకటించింది. అడ్వాన్స్ రిజర్వేషన్, ఇ-టికెట్స్ తీసుకోవడం సాధ్యం కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
4. రైళ్లు రద్దు అయ్యాయి కాబట్టి టికెట్లు ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతాయి. రీఫండ్ ప్రాసెస్ కూడా మొదలవుతుంది. ఏప్రిల్ 14 వరకు రద్దైన రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్నవారి రీఫండ్ విషయంలో గందరగోళం తలెత్తిన సంగతి తెలిసిందే. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. వారికి క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
5. ఆ తర్వాత ప్రయాణికులు కంప్లైంట్ చేయడంతో వారికి మిగతా మొత్తాన్ని రీఫండ్ చేసింది రైల్వే. ఇప్పుడు మే 3 వరకు రైళ్లు రద్దు కావడంతో ఐఆర్సీటీసీ అప్రమత్తమైంది. రైలు టికెట్లపై రీఫండ్ విషయంలో స్పష్టత ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
6. భారతీయ రైల్వే రద్దు చేసిన అన్ని రైళ్లల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఫుల్ రీఫండ్ ఇస్తామని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ప్రయాణికులు ఇ-టికెట్లను క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏ కార్డులు, అకౌంట్లు, వ్యాలెట్ల ద్వారా పేమెంట్ చేస్తే ఆ అకౌంట్లలోకే రీఫండ్ వస్తుందని ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
7. ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేయకపోవడమే మంచిది. ప్రయాణికులు టికెట్లు రద్దు చేస్తే రీఫండ్‌లో సమస్య వచ్చే అవకాశముంది. ఐఆర్సీటీసీ టికెట్లను క్యాన్సిల్ చేస్తే పూర్తి రీఫండ్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
8. లక్షలాది ప్రయాణికుల టికెట్లు రద్దు కావడంతో రీఫండ్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఐఆర్సీటీసీ తక్కువ సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున జాప్యం తప్పదు. కాబట్టి ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టికెట్లు క్యాన్సిల్ అయిన 4 నుంచి 7 రోజుల్లో రీఫండ్ అకౌంట్లో జమ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
9. ఇక రైల్వే కౌంటర్ల దగ్గర బుకింగ్ చేసినవారి కోసం రీఫండ్ రూల్స్‌ని సవరించింది భారతీయ రైల్వే. ఆ ప్రయాణికులు జూలై 31 వరకు రీఫండ్ పొందొచ్చు. అంటే ప్రయాణికులు తమ ప్రయాణ తేదీ నుంచి మూడు నెలల వరకు ఎప్పుడైనా రీఫండ్ తీసుకునే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
10. లాక్డౌన్ సమయంలో భారతీయ రైల్వే కేవలం గూడ్స్ రైళ్లు నడుపుతున్న సంగతి తెలిసిందే. పాలు, నిత్యావసర వస్తువులు, వైద్య పరికరాలను సరఫరా చేసేందుకు మాత్రమే రైలు సేవల్ని వినియోగించుకుంది. ఇప్పుడు మే 3 వరకు లాక్డౌన్ కొనసాగుతుండటంతో గూడ్స్ రైళ్లు మాత్రమే నడిచే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)