ఇండియాలో కరోనా మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా కేరళలో పరిస్థితి అస్సలు బాలేదు. అక్కడ కొత్తగా 31.27వేల పాజిటివ్ కేసులు రావడం... వారం నుంచి కేసులు రోజూ 20వేలకు పైగా వస్తుండటంతో... అలర్టైన ప్రభుత్వం నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూని అమల్లోకి తెస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ప్రకటించారు. కేరళలో కొత్తగా 153 మంది చనిపోగా... వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 18.21 శాతంగా ఉంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువ రేటు లేదు. 89 రోజుల తర్వాత మళ్లీ కేరళలో యాక్టివ్ కేసులు 2 లక్షలు దాటాయి. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో కేరళవి 55.74 శాతం ఉన్నాయి. దేశంలోని మొత్తం కొత్త కేసుల్లో కేరళవి 69.35 శాతం ఉన్నాయి. ప్రస్తుతం కేరళ సహా 10 రాష్ట్రాలు లేదా కేంద్రపాలితాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. (image credit - twitter - reuters)
ఇండియాలో కొత్తగా 35,840 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,18,88,642కి చేరింది. రికవరీ రేటు 97.5 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్లో 3,68,558 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,55,327 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 51 కోట్ల 86 లక్షల 42 వేల 929 టెస్టులు చేశారు. కొత్తగా 73,85,866 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 63 కోట్ల 09 లక్షల 17 వేల 927 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 64,550 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,557 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. కొత్తగా 18 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,825కి చేరింది. కొత్తగా 1,213 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,83,119కి చేరింది. ప్రస్తుతం 15,179 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,65,35,822 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 257 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,57,376కి చేరాయి. కొత్తగా 409 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,47,594కి చేరింది. రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఒకరు మరణించారు. మొత్తం మరణాలు 3,870కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,912 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 4,48,743 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 21.71 కోట్లు దాటింది. కొత్తగా 7,271 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 45.55 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.85 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 36,561 కేసులు, 284 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 13,210 కొత్త కేసులు, 256 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)