INDIA COVID UPDATES 43733 NEW CORONA CASES AND 930 DEATHS REPORTED IN LAST 24 HOURS SK
India Corona Updates: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇది.. కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..
India Corona Updates: భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులతో పాటు మరణాలు సంఖ్య కూడా పడిపోయింది. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మంది చనిపోయారో ఇక్కడ చూద్దాం.
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 43,733 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ బారినపడి మరో 930 మంది కన్నుమూశారు. నిన్న కొత్తగా 47,240 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మనదేశంలో 4,59,920 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
తాజా లెక్కలతో మనదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,63,665కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 2,97,99,534 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,04,211 మంది మరణించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ప్రస్తుతం కేరళలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. కేరళలో నిన్న 14,373 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 8,418, కర్నాటకలో 3,104, ఏపీలో 3,042 మంది కరోనా బారినపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
మనదేశంలో నిన్న 19,07,216 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 42 కోట్ల 33 లక్షల 32,097 మందికి టెస్ట్‌లు నిర్వహించారు. 36.17 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (image credit - twitter)