ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్‌పై చర్చ నడుస్తోంది. అన్ని దేశాలూ థర్డ్‌వేవ్‌ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై చర్చిస్తున్నాయి. ప్రధానంగా ఈ వేవ్‌లో పెద్దల కంటే పిల్లలకే ఎక్కువగా కరోనా సోకవచ్చు అంటున్నారు. అలా ఎందుకు అనే ప్రశ్నకు వారు ఓ సమాధానం చెబుతున్నారు. మొదటి, రెండో వేవ్‌లలో పెద్దవాళ్లకు, మధ్య వయసు వాళ్లకు కరోనా సోకిందనీ... వాళ్లలో యాంటీబాడీలు ఉన్నాయనీ... అందువల్ల థర్డ్ వేవ్‌లో వారికి కరోనా సోకే అవకాశాలు తక్కువ అంటున్నారు. అందువల్ల ఈ వైరస్.. థర్డ్ వేవ్‌లో పిల్లలను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. అందువల్ల ఇప్పుడు తల్లిదండ్రులు, ప్రభుత్వాలూ... అందరూ పిల్లల్ని (2 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారు) ఎలా కాపాడాలి అనే అంశంపై ఫోకస్ పెడుతున్నారు. (image credit - Twitter)
ఇండియాలో ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా... తను తయారుచేసిన జైకోవ్-డి వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇవ్వాల్సిందిగా అప్లికేషన్ పెట్టుకుంది. కేంద్రం ఓకే చెబితే... ఇది దేశంలో వాడుకలోకి వచ్చిన నాలుగో వ్యాక్సిన్ అవుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే... ఇది 3 డోసుల వ్యాక్సిన్. మొదటి డోస్ వేసుకున్నాక... నెల రోజులకు రెండో డోస్ ఇస్తారు. ఆ తర్వాత మరో నెలకు మూడో డోస్ ఇస్తారు. 12 ఏళ్లు దాటిన పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. (image credit - Twitter)
ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో... తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తోంది. ఈ నెల 20 నుంచి... సడలింపులు మరింత పెంచుతూ... రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ ఉండేలా చెయ్యాలనుకుంటున్నట్లు తెలిసింది. అలా ఓ పది రోజులు కానిచ్చి... ఆ తర్వాత దాన్ని కూడా ఎత్తేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జులై 1 నుంచి బార్లు, పబ్‌లు, జిమ్‌లు, మాల్స్ కి పూర్తి అనుమతి ఇచ్చి... థియేటర్లకు 50 శాతం సీటింగ్‌తో అనుమతి ఇవ్వాలి అనుకుంటున్నట్లు తెలిసింది. అటు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రజల రాకపోకలు మరింత పెరిగాయి. (image credit - Twitter)
చిన్నారులపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జోరందుకున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలోని ఎయిమ్స్ లో 12 నుంచి 18 ఏళ్ల పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ కు ఎంపిక ముగిసింది. జూన్ 3న పిల్లలపై కోవాగ్జిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. రెండో దశలో భాగంగా 6 నుంచి 12 ఏళ్ల పిల్లలపై ప్రయోగాలు చేస్తారు. ఇందుకోసం ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వాలో... ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లల ఎంపిక మొదలవుతుంది. మూడో దశలో 2 నుంచి 6 సంవత్సరాల పిల్లలపై ప్రయోగాలు చేస్తారు. మొత్తం మూడు దశల్లో కలిపి... 175 మంది పిల్లలపై ట్రయల్స్ జరుగుతాయి. (image credit - Twitter)
Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 70,421 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. కొత్తగా 3,921 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,74,305కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.16 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 1,19,501 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,81,62,947కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 95.4కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 9,73,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 14,92,152 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 37 కోట్ల 96 లక్షల 24 వేల 626 టెస్టులు చేశారు. కొత్తగా 14,99,771 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 25 కోట్ల 48 లక్షల 49 వేల 301 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - Twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,511 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,04,880కి చేరాయి. కొత్తగా 2,175 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,80,923కి చేరింది. రికవరీ రేటు 95.39 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 12 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,496కి చేరాయి. మరణాల రేటు 0.57 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,461 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 87,756 టెస్టులు చెయ్యగా... కొత్తగా 4,549 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,14,393కి చేరింది. కొత్తగా 59 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 11,999కి చేరింది. కొత్తగా 10,114 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,22,381కి చేరింది. ప్రస్తుతం 80,013 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,05,38,738 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 2,95,024 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.70 కోట్లు దాటింది. కొత్తగా 6,299 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.27 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.19 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 9,301 కేసులు, 191 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 40,865 కొత్త కేసులు... 928 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు ఇండియా లేదా బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత కొలంబియా, అర్జెంటినా, రష్యా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉండగా... ఆ తర్వాత బ్రెజిల్, అర్జెంటినా, కొలంబియా, రష్యా ఉన్నాయి. (image credit - twitter - reuters)