India Covid Updates : కొద్దిగా తగ్గిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 21,411 కేసులు, 67 మరణాలు..
India Covid Updates : కొద్దిగా తగ్గిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 21,411 కేసులు, 67 మరణాలు..
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతున్నా, కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడంలేదు. అయితే కిందటి రోజుతో పోల్చుకుంటే కొత్త కేసులు కొద్దిగా తగ్గాయి, మరణాల సంఖ్య పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం (జులై 23) వెల్లడించిన గణాంకాలివి..
గడిచిన 24 గంటల్లో మొత్తం 4,80,202 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 21,411 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,38,68,476కి చేరాయి. ఇప్పటిదాకా జరిపిన టెస్టుల సంఖ్య 87, 21,36,407కు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
గత 24 గంటల్లో 20,726 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తద్వారా మొత్తం కరోనా కేసుల్లో 4,31,92,379 మంది బాధితులు కోలుకున్నట్లయింది. జాతీయ రికవరీ రేటు 98.46%గా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఇవాళ కొత్త కేసులు తగ్గినా, కిందటి రెండు రోజుల్లో అవి గణనీయంగా ఉండటంతో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,50,100గా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 0.33శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 4.46శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి వల్ల 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 525,997 మంది కొవిడ్ వ్యాధికి బలయ్యారు. దేశంలో మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా నిన్న ఒక్కరోజే 34,93,209 డోసుల టీకాలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 2,01,68,14,771 కరోనా టీకా డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,49,174మంది వైరస్ బారినపడగా.. మరో 335 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 573,873,112కు, మరణాల సంఖ్య 6,401,183కు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)