Covid-19: దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు.. కోవిడ్ థర్డ్ వేవ్‌పై గులేరియా కీలక వ్యాఖ్యలు
Covid-19: దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు.. కోవిడ్ థర్డ్ వేవ్‌పై గులేరియా కీలక వ్యాఖ్యలు
India Covid-19: ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో కోవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. త్వరలో మూడో దశ వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కరోనా నిబంధనలను ప్రజలు పాటించడంపైనే మూడో దశ కోవిడ్-19 వ్యాప్తి ఆధారపడి ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం 41వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడూతూ ఈ వ్యాఖ్యలు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
పిల్లలపై థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతుందన్న దానికి సరైన అధ్యయనం లేదని ఆయన చెప్పారు. పిల్లలకు వ్యాక్సినేషన్ అందుబాటులో లేనందున.. ఎక్కువగా వైరస్ బారిన పడేవాళ్లలో వీరు అధికంగా ఉంటారని అంచనావేస్తున్నారని పేర్కొన్నారు. (Image:ANI)
3/ 5
ప్రస్తుతం ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని గలేరియా చెప్పారు. కొవిడ్ ప్రవర్తనా నియమావళిని ఏ మేరకు పాటిస్తున్నామనే అంశంపైనే వైరస్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడి ఇప్పుడు బాగుందని గులేరియా చెప్పారు. ఏదేని ఒక ప్రాంతంలో హఠాత్తుగా కేసుల పెరిగితే.. వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఇతర ప్రాంతాలకు వ్యాపించడకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ను కోవిడ్19పై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని.. అదే సమయంలో వైరస్ కూడా రూపాంతరం చెందుతున్నాయని చెప్పారు. అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. కోవిడ్ నిబంధనలను పాటంచాలని చెప్పుకొచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)