HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
INDIA CORONA VIRUS 126786 NEW COVID CASES AND 685 DEATHS REPORTED IN INDIA IN LAST 24 HOURS SK
India Coronavirus: ఒక్కరోజే లక్షా 26వేల కేసులు.. ఇండియాలో ఇదే ఆల్ టైమ్ రికార్డ్
భారత్లో కరోనా వైరస్ భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. ఎవరూ ఊహించని విధంగా పంజా విసురుతోంది. గత ఏడాదిని మించి అల్లకల్లోలం రేపుతోంది. రోజు వారి కొత్త కేసులు లక్షకు పైగా నమోదువుతన్నాయి. ఐతే గడిచిన 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డు కేసులు వచ్చాయి. మరి ఎంత మందికి కరోనా నిర్ధారణ అయింది?ఎంత మంది మరణించారు? ఈ వివరాలు ఇక్కడ చూడండి
News18 Telugu | April 8, 2021, 10:21 AM IST
1/ 5
Coronavirus Updates: భారత్లో బుధవారం పెద్ద మొత్తంలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏకంగా 1,26,789 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు మనదేశంలో నమోదైర రోజు వారి కేసల సంఖ్యలో ఇదే అత్యధికం. బుధవారం 59,258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ బాధితుల్లో బుధవారం 685 మంది మరణించారు. (image credit - NIAID)
2/ 5
తాజా లెక్కలతో ఇండియాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,29,28,574కి చేరింది. కరోనా వ్యాధి నుంచి ఇప్పటి వరకు 1,18,51,393 మంది కోలుకున్నారు. కోవిడ్ బారిన పడి 1,66,862 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 9,10,319 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అక్కడ 59,907 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఛత్తీస్గఢ్లో 10,310, కర్నాటకలో 6,976, కేరళలో 3502, తమిళనాడులో 3,986, పంజాబ్లో 2963, మధ్యప్రదేశ్లో 4043, గుజరాత్లో 3575 మందికి కొత్తగా కరోనా సోకింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
మన దేశంలో బుధవారం 12,37,781 మందికి కరోనా టెస్ట్లు చేశారు. ఇప్పటి వరకు 25,26,77,379 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక దేశవ్యాప్తంగా 9,01,98,673 మందికి కరోనా టీకా వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)