భారత్లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో వెయ్యి మందికి పైగా మరణించారు. భారత్లో గడిచిన 24 గంటల్లో 64,553 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 1,007 మంది మరణించారు. తాజా లెక్కలతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,61,191 కి చేరింది. ఈ లెక్కన మన దేశంలో సగటున గంటకు 2,689 మంది కరోనా బారినపడుతున్నారు. ప్రతి గంటకు 41 మంది మరణిస్తున్నారు. ఇప్పటి వరకు 17,51,556 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 6,61,595 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో బాధపడుతూ మనదేశంలో ఇప్పటి వరకు 48,040 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 8,48,728 కరోనా పరీక్షలు చేశారు. దాంతో మొత్తం టెస్టుల సంఖ్య 2 కోట్ల 76 లక్షల 94 వేల 416కి చేరింది. మొత్తం కేసుల పరంగా చూస్తే అత్యధికం మహారాష్ట్రలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఏపీ ఉన్నాయి. రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు