INDIA CORONA UPDATES 43393 COVID CASES REPORTED YESTERDAY ACROSS INDIA HERE IS LATEST BULLETIN SK
India Corona Updates: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇది.. యాక్టివ్ కేసులు ఎన్నంటే...
India corona updates: భారత్‌లో రెండు రోజులుగా కరోనా కేసులు స్వల్పంగా పెరగడంతో కొంత ఆందోళన నెలకొంది. ఐతే ఇవాళ మళ్లీ కేసులు తగ్గాయి. నిన్నటి కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. కరోనాకు సంబంధించి తాజా బులెటిన్‌ను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసింది. నిన్న ఎన్ని కేసులు వచ్చాయి? ఏ రాష్ట్రంలో ఎక్కువ కేసులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
మనదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటితో పోల్చితే మరింతగా కొత్త కేసులు తగ్గాయి. గురువారం మనదేశంలో 43,393 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 44,459 మంది కోలుకోగా.. 911 మంది మరణించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
తాజా లెక్కలతో భారత్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,07,52,950కి చేరింది. వీరిలో ఇఫ్పటి వరకు 2,98,88,284 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 4,05,939 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 4,58,727 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో మాత్రమే ప్రతి రోజు 10వేలకు పైగా కేసులు వస్తున్నాయి. ఐతే నాలుగో వంతు కేసులలు అక్కడే నమోదవుతున్నాయి. నిన్న కేరళలో 13,772 కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో 9083 మంది కోవిడ్ బారినపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
నిన్న మనదేశంలో 17,90,708 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 42,70,16,605 కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 36, 89,91,222 డోస్‌ల టీకాలు వేశారు.