HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
INDIA CORONA CASES TALLY CROSSES 80 LAKH MARK SU
India Corona Cases: భారత్‌లో 80 లక్షలు దాటిన కరోనా కేసులు.. భారీగా పెరిగిన రికవరీ రేటు..
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 49,881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,40,203కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
News18 Telugu | October 29, 2020, 10:00 AM IST
1/ 6
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 49,881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,40,203కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
2/ 6
భారత్‌లో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా భారత్‌లో కరోనా రికవరీ రేటు 91 శాతానికి చేరింది.
3/ 6
గడిచిన 24 గంటల్లో 56,480 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 73,15,989గా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 6,03,687 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
4/ 6
బుధవారం రోజున దేశవ్యాప్తంగా 10,75,760 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 10,65,63,440కి చేరింది.
5/ 6
కొత్తగా 517 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,20,527కి చేరింది.