India Covid-19: భారత్‌లో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. కరోనా తాజా బులెటిన్ వివరాలు
India Covid-19: భారత్‌లో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. కరోనా తాజా బులెటిన్ వివరాలు
India Coronavirus updates: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్నటితో పోల్చితే ఇవాళ కొత్త కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెలలోనే థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలోనే మళ్లీ కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 22,431 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి బులెటిన్‌లో 18,833 కేసులు రాగా.. ఇవాళ మాత్రం పెరిగాయి. కరోనా నుంచి 24,602 మంది కోలుకున్నారు. మరో 318 మంది మరణించారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
తాజా కేసులతో కలిపి మన దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. వీరిలో 3,32,00,258 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 4,49,856 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 2,44,198 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ప్రస్తుతం ఒక్క కేరళలో మాత్రమే 10వేలకు పైగా కేసులు వస్తున్నాయి. కేరళలో నిన్న 12,616 మంది కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. అక్కడ 2876 కేసులు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఐతే ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో కొత్త కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మిజోరాంలో నిన్న 1302 మందికి కరోనా నిర్ధారణ అయింది. 1226 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఆరుగురు మరణించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
నిన్నదేశవ్యాప్తంగా 14,31,819 మందికి కరోనా పరీక్షలుచేశారు. ఇప్పటి వరకు 57.86 లక్షల టెస్ట్‌లు నిర్వహించారు. బుధవారం మన దేశంలో 43 లక్షల మందికి పైగా టీకాలు వేశారు. ఇప్పటి వరకు 92.63కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మకచిత్రం)