Omicron Alert:జెట్ స్పీడ్ వేగంతో కొత్త వేరియంట్ దూసుకోస్తోంది. ఇప్పటికే పలు దేశాలపై దాడి చేసింది. నిత్యం వందల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి. మెళ్లి మెళ్లిగా భారత్ లోనూ దాడి చేసే దిశగా దూసుకు వస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలామందికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. అయితే అందులో అతి తక్కువ మందికే ప్రస్తుతం ఒమిక్రాన్ నిర్ధారణ అవుతోంది. ప్రస్తుతానికి అంత ప్రమాదకరంగా లేకపోయినా.. ప్రమాదాన్ని అంచనా వేయలేం అంటున్నారు అధికారులు..
ఇప్పటికే భారత దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20 మార్క్ ను క్రాస్ చేసింది. మరికొద్ది మంది శాంపిల్స్ రావాల్సి ఉంది. అన్నికంటే ముఖ్యంగా విదేశాల నుంచి మన దేశంలో వివిధ రాష్ట్రాలకు చేరుకున్న వారిలో చాలామంది అడ్రస్ దొరకడం లేదు. వారి ఫోన్ లు కూడా స్విచ్ ఆఫ్ అయి ఉండడం అందోళన పెంచుతోంది. అందులో ఎంతమందికి వైరస్ ఉంది. అన్నది తెలీదు.. వారంత ఎక్కడ ఉన్నారు. ఎవరెవరితో కలుస్తున్నారు అన్నది తెలియడం లేదు. అందులో కొందరికి ఒమిక్రాన్ ఉన్నా.. జెట్ స్పీడ్ వేగంతో ఇతరులకు సోకీ అవకాశం ఉంది.
అయితే ఇందులో ఊరట ఇచ్చే అంశం ఏంటంటే.. ఒమిక్రాన్ వేరియెంట్ గురించి ఇటీవలే వైద్యనిపుణులు ఊరటనిచ్చే విషయాన్ని చెప్పారు. ఇది అత్యంత వేగంగా వ్యాపించే వైరస్ అయినప్పటికీ.. డెల్టా వేరియెంట్‌తో పోల్చితే అంత ప్రమాదకరమేమీ కాదని చెబుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని వెల్లడించారు. కానీ వేగంగా విస్తరిస్తుండడంతో ఎక్కువమంది ఒమిక్రాన్ బారిన పడే అవకాశాలు లేకపోలేదు.
ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. మళ్లీ నిబంధనలు కఠినంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. మళ్లీ లాక్ డౌన్ లాంటి పరిస్థితి తలెత్తకూడదు అంటే.. కచ్చితంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రమాదం పొంచే ఉంటుంది.
ఒమిక్రాన్ భయం.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా థర్డ్ వేవ్ రావడానికి ముందే దాని వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటి నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవడం రైల్వే అధికారులు ప్రారంభించారు. ముఖ్యంగా దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరిగిపోవడంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది.
ప్రతి రైల్వే కార్మికుడికి టీకాలు వేయడంతో పాటు మాస్క్ లేని వారికి రైల్వే స్టేషన్ల, రైళ్లలో ప్రవేశం లేదంటున్నారు అధికారులు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి రావాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మాస్క్ లేకుండా రైల్వే స్టేషన్లోకి వస్తే 500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు.
రైల్వే స్టేషన్లలో కొత్త ఆదేశాలు పాటించకుండా వెతికి పట్టుకొని మరి జరిమానా విధిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కొత్త రూల్స్ పట్ల ప్రయాణికులకు అవగాహన కోసం ప్రకటనల బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని, కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు.