మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఊహకందని విధంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కరోనా రోగులతో అన్ని ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కొన్ని చోట్ల బెడ్స్ కూడా దొరకడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
మహారాష్ట్రలో తాజాగా హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. ఓ కరోనా బాధితుడిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసేందుకు వెళ్లగా అక్కడ బెడ్స్ ఖాళీ లేవని తిప్పిపంపించారు. తండ్రి పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అతడి తనయుడు.. ''మీ ఆస్పత్రిలో బెడ్స్ లేకుంటే, కనీసం ఇంజెక్షన్ ఇచ్చైనా మా తండ్రిని చంపేయండి..'' అని ఆవేదన వ్యక్తం చేశాడు. (ప్రతీకాత్మక చిత్రం)
చివరకు తెలంగాణకు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. బెడ్స్ ఖాళీగా లేవని.. అడ్మిట్ చేసుకోవడం కుదరదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఇలా ఎన్ని ఆస్పత్రులు తిరిగినా.. బెడ్ దొరకపోవడంతో అతడి కుమారుడు సాగర్ కిశోర్ నహర్శెతివర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆస్పత్రిలో బెడ్ లేకుంటే ఇంజెక్షన్ వేసి మా తండ్రి చంపేయండని.. వాపోయారు. (ప్రతీకాత్మక చిత్రం)