Covid Test: ఇంట్లోనే సొంతంగా కరోనా టెస్ట్.. కొత్త కిట్‌కు ICMR అనుమతి.. ఎలా పనిచేస్తుందంటే..

ప్రస్తుతం కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే సమీపంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలి. ప్రభుత్వాస్పత్రిలో పరిమిత సంఖ్యలోనే టెస్ట్‌లు చేస్తున్నారు. ప్రైవేట్‌కు వెళ్దామంటే వేలకు వేలు వసూలు చేస్తున్నారు. మరోవైపు టెస్ట్‌ల కోసం వచ్చే వారిని చూసి చాలా మంది భయపడుతున్నారు. లేని వైరస్ కూడా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఐతే ఇక నుంచి ఈ బాధలు ఉండవు. ఇంటి వద్దే మనమే కరోనా టెస్ట్ చేసుకునే కిట్ వచ్చేసింది.