ఎటుచూసినా కరోనా, ఎక్కడికి వెళ్లినా కరోనా. అసలు కరోనా లేని ప్రాంతం అంటూ లేదా అని అనిపించడం సహజం. మన దేశంలో అలాంటి ఓ ప్రాంతం ఉంది. అదే లక్షదీవులు. కరోనా నుంచి ప్రపంచదేశాలేవీ తప్పించుకోలేకపోయాయి. లక్షద్వీప్ మాత్రం కరోనాకి బ్రేక్ వేయగలిగింది. అక్కడ ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్ కేసూ రాలేదంటే నమ్మడం కష్టమే. ఇండియాలో ఫిబ్రవరిలో కరోనా మొదలైంది. అప్పటి నుంచి లక్షదీవుల్లో ఇప్పటివరకూ ఒక్క కేసూ నమోదుకాలేదు. లక్షదీవుల్లో ఈ పరిస్థితి ఉండటానికి అక్కడి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణం. (credit - twitter)
లక్షదీవుల జనాభా 64473 మంది. ఆస్పత్రులు చాలా తక్కువ. మూడే ఉన్నాయి. అంటే కరోనా సోకి ఉంటే... అక్కడ కంట్రోల్ చెయ్యడం కష్టమయ్యేది. సరైన వైద్య సదుపాయాలు అందించలేకపోయేవారు. అందుకే ప్రభుత్వం కఠినమైన నిఘాను అమలుచేసింది. రాజధాని కవరత్తికి వచ్చేవారికి తప్పనిసరిగా క్వారంటైన్ విధానం అమలుచేసింది. లక్షదీవులకు ఎవరు రావాలన్నా... ముందుగా కేరళలోని... కొచ్చిలో... రెండు వారాలపాటూ క్వారంటైన్ ఉండాల్సిందే. ఆ తర్వాత మాత్రమే లక్షదీవులకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మరోసారి టెస్ట్ చేసి... అప్పుడు మాత్రమే దీవుల్లోకి అనుమతిస్తున్నారు. (credit - twitter)
ప్రస్తుతం సౌత్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటకలో కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. లక్షదీవులకు వెళ్లేవారిలో... సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ... అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం వల్ల కరోనాను రాకుండా చేయగలిగింది. ఇప్పటివరకూ 61 మందికి అనుమానిత లక్షణాలు కనిపించాయి. కానీ అందరికీ నెగెటివ్ అనే వచ్చింది. ఇంత జాగ్రత్తగా ఉంటున్నా... కరోనా సోకుతుందేమో అనే భయం అక్కడి ప్రజల్లో ఉంది. ప్రస్తుతానికి దేశానికి లక్షదీవులే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు అక్కడ స్కుళ్లను తెరవాలనుకుంటున్నారు. అందుకు కేంద్రం అనుమతిస్తే మొదలవుతాయి. అదే జరిగితే... మిగతా రాష్ట్రాలూ ఆ దిశగా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. (credit - twitter)