HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
HOW INDIAN RAILWAYS PLANS TO TRANSPORT CORONA VACCINE KNOW HERE MS
Corona Vaccine: రైళ్లలో కరోనా టీకా సరఫరా.. సిద్దమవుతున్న భారతీయ రైల్వే...
Corona Vaccine Updates: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ తీసుకువచ్చే ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ తో సహా పలు దేశాలు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించాయి.
News18 | December 21, 2020, 9:45 PM IST
1/ 7
కరోనా వ్యాక్సిన్ టీకా తుది దశకు చేరుకున్న నేపథ్యంలో.. దానిని ల్యాబ్ ల నుంచి మారుమూల గ్రామాలకు చేర్చడానికి ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. అయితే భారతీయ రైల్వే.. తాము ఆ గురుతర బాధ్యతను మోస్తామంటూ ముందుకొస్తున్నది.
2/ 7
భారతీయ రైల్వ్లేకు వందలాది రిఫ్రిజిరేటెడ్ వ్యాగన్లున్నాయి. కూరగాయలు, పండ్లు, పాలు వంటి ఇతర త్వరగా పాడైపోయే వస్తువులను తొందరగా గమ్యస్థానం చేర్చడానికి గానూ.. భారతీయ రైల్వేలు ఈ రిఫ్రిజిరేటెడ్ వ్యాగన్లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
3/ 7
ఈ వ్యాగన్లు.. 5 టన్నుల వరకు త్వరగా పాడైపోయే వస్తువులను, మరో 12 టన్నుల దాకా పండ్లు, కూరగాయలను మోసుకుపోయే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
4/ 7
దీంతో పాటు ఇటీవలే.. కపుర్తలా లో మరో 12 టన్నుల సామర్థ్యం గల రిఫ్రిజిరేటర్ల వ్యాగన్ కోచ్ ను ప్రారంభించింది. ఇలాంటివి మన దేశంలో తొమ్మది వ్యాగన్ కోచ్ లు ఉన్నాయి.
5/ 7
రైల్వేలలో సుమారు 98 రిఫ్రిజిరేటర్ (వెంటిలేటెడ్ ఇన్సులేటెడ్) రైలు కంటైనర్లున్నాయి. వీటికి ఒక్కో కంటైనర్.. 12 టన్నుల దాకా మోసే సామర్థ్యం ఉంది.
6/ 7
కరోనా వ్యాక్సిన్ ను అత్యంత జాగ్రత్తగా.. దానికి సూర్యరశ్మి తగలకుండా తీసుకురావాల్సి ఉంది. అంతేగాక.. దానిని భద్రపరచడం కూడా కత్తి మీద సాము వంటిదే. ఈ నేపథ్యంలో మన రైల్వేలు.. ఆ లోటును భర్తీ చేయనున్నాయి.
7/ 7
అయితే.. కరోనా వ్యాక్సిన్ ను రైళ్ల ద్వారా తరలించే ప్రక్రియకు సంబంధించి ఇప్పటికీ కేంద్రంతో చర్చలు సాగుతున్నాయి. ఇవి కూడా తుది దశలో ఉన్నాయని రైల్వే బోర్డు చైర్మెన్ వికె యాదవ్ అన్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకున్నాక.. అధికారిక ప్రకటన చేస్తామని ఆయన వెల్లడించారు. దీనిలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని.. వాటిని త్వరలోనే అధిగమిస్తామని కూడా ఆయన తెలిపారు.