ప్రపంచానికే పెను సవాల్ గా మారిన కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ జడలు విప్పుతోంది. ముఖ్యంగా భారత్ లో రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. న్యూ ఇయర్ వేడుకల ఫలితంగా మళ్లీ రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ ఆందోళన కలిగించే స్థాయికి చేరింది.(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ రోజు ఏకంగా 1520 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో మరొకరు చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే నమోదైన కేసుల్లో దాదాపు రెండు వంతుల పైగా హైదరాబాద్ లోనే నమోదుకావడం అందోళన కలిగించే అంశంగా మారింది.(ఫొటో: ట్విట్టర్)