కరోనా రూపు మారుతున్న కొద్ది.. లక్షణాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చాలా వరకు జ్వరం, జలుబు, గొంతు నొప్పి.. లక్షణాలు ఉంటే కరోనా వచ్చిందని చాలా మంది అనుకునేవారు. రుచి, వాసన కూడా తెలియకపోతే కరోనా అని నిర్దారణకు వచ్చేవారు. వెంటనే పరీక్షలు చేయించుకుని.. కరోనా నిర్ధారణ అయితే జాగ్రత్తలు తీసుకోవడం, చికిత్స పొందడం చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)