ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం దశలవారీగా కర్ఫ్యూ సడలింపులు ఇస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 8
ప్రస్తుతం ఏపీలో జిల్లాల వారీగా కర్ఫ్యూ సమయాలు అమలువుతున్నాయి. జూలై 1 నుంచి 7 వరకు 9 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నాలుగు జిల్లాల్లో సాయంత్రం 6గంటల వరకే సడలింపులిచ్చారు.
3/ 8
ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా మరిన్ని జిల్లాల్లో సడలింపులిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
4/ 8
ఉభయగోదావరి జిల్లాల్లో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు సడలింపులిచ్చారు. ఐతే సాయంత్రం 6గంటల వరకే వ్యాపార సంస్థలు, కార్యాలయాలు తెరిచేందుకు అనుమతిచ్చారు.
5/ 8
ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు సడలింపులివ్వగా.. రాత్రి 9గంటలకు వ్యాపార సంస్థలు, కార్యాలయాలు మూసివేయాల్సి ఉంటుంది.
6/ 8
సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా థియేటర్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.