AP Curfew Timings Update: ఏపీ కర్ఫ్యూ సమయాల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే.. ఆ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్
AP Curfew Timings Update: ఏపీ కర్ఫ్యూ సమయాల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే.. ఆ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిబంధనలపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తగ్గడంతో కర్ఫ్యూ సడలింపులు ఇస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 5
ప్రస్తుతం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రాత్రి 9 గంటల వరకు, ఉభయగోదావరి జిల్లాలో సాయంత్రం 6గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 5
తాజాగా కర్ఫ్యూ నిబంధనలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 5
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటలకు వ్యాపారసంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు నడుస్తాయి. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 5
ఇక కర్ఫ్యూ సడలింపులున్న సమయాల్లో బయటకి వచ్చినప్పుడు మాస్క్ ధరించకుంటే రూ.100 జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం)