AP Lockdown Timings: ఏపీ లాక్ డౌన్ వేళల్లో మార్పులు... క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
AP Lockdown Timings: ఏపీ లాక్ డౌన్ వేళల్లో మార్పులు... క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ (Andhra Pradesh Lockdown) సమయాల్లో మార్పులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
1/ 6
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పాక్షిక లాక్ డౌన్ అమలవుతోంది. మధ్యాహ్నం 12గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలవుతోంది.
2/ 6
తొలుత ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఆంక్షలు మంగళవారంతో ముగియనుండగా.. కర్ఫ్యూను ఈనెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
3/ 6
ఐతే ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ సమయంలో మార్పులు చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఈనెల 20 నుంచి అన్నిరకాల కార్యకలాపాలకు ఉదయం 10 గంటల వరకే అనుమతిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
4/ 6
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అదంతా ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది.
5/ 6
లాక్ డౌన్ సమయాల్లో ఎలాంటి మార్పు లేదని.. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని తెలిపింది.
6/ 6
ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని.. మధ్యాహ్నం 12గంటల వరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ వ్యవహారాలు చూసుకోవచ్చని తెలిపింది.